Site icon NTV Telugu

Ram Mandir: అయోధ్య రామాలయం టైమింగ్స్ మార్పు.. 10 రోజులు వీఐపీలు రావొద్దని విజ్ఞప్తి..

Ayodhya

Ayodhya

రాంలాలా దర్శనం కోసం అయోధ్యకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. లక్షలాది మంది శ్రీరాముడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. జనాలను అదుపు చేయడం భద్రతా బలగాలకు సవాలుగా మారింది. తొలిరోజైన మంగళవారం రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనాన్ని కొంతసేపు నిలిపివేసింది. ఇక, ఇవాళ (బుధవారం) కూడా ఇదే పరిస్థితి నెలకొంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా క్షణక్షణం అప్‌డేట్‌లు తీసుకుంటున్నారు. ఆయన ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ ఏడీజీ ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోంశాఖ) సంజయ్ ప్రసాద్ స్వయంగా రామమందిరంలో ఏర్పాట్లను చూస్తున్నారు. రానున్న 10 రోజుల పాటు వీఐపీలు అయోధ్యకు రావొద్దని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Read Also: IND vs ENG: విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్.. అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటు: రోహిత్

ఇక, రాంలాల దర్శనం కోసం ఇవాళ కూడా ఉదయం నుంచి రామాలయం వెలుపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాన్ని కూడా పొడిగించారు. ఇకపై భక్తులు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాంలాలా దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రద్దీ నిర్వహణకు పలు చర్యలు చేపట్టారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భక్తులందరినీ క్యూలైన్లలో నిలబెట్టి దర్శనం నిరంతరం కొనసాగిస్తున్నారు.

Read Also: Air India: ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.1.10 కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా..?

అయితే, నిన్న అయోధ్యలోని రాంలాలాను 5 లక్షల మంది దర్శించుకున్నారు. రాంలాలా దర్శనం కోసం అయోధ్యకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని రోజుల పాటు ఇక్కడికి వచ్చే అన్ని వాహనాలపై నిషేధం విధించింది. అయోధ్య నుంచి బారాబంకి వరకు దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆలయ నిర్వాహకులు పంచ కోసి పరిక్రమ మార్గం దగ్గర వాహనాలన్నింటినీ ఆపేయడంతో జనాల పరిస్థితి అయోమయంగా ఉంది.

Exit mobile version