Site icon NTV Telugu

Ayodhya: రామమందిర శంకుస్థాపన ఆహ్వానితులకు ప్రత్యేక బహుమతులు

Ayodya Ram Mandir

Ayodya Ram Mandir

2024 జనవరి 22న “ప్రాణ్ ప్రతిష్ఠ” విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అయితే.. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన విశిష్ట అతిథులందరికీ ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్ట్ బుధవారం ప్రకటించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం, హాజరైనవారికి పవిత్ర ప్రసాదంతో పాటు, గీతా ప్రెస్ నుండి ‘అయోధ్య దర్శన్’ పుస్తకం కాపీలను అందించనున్నట్లు చెప్పారు.

‘అయోధ్య దర్శనం’ పుస్తకంలో అయోధ్యకు సంబంధించిన సమగ్ర సమాచారం, చరిత్ర, ప్రాచీన ప్రాముఖ్యత, రామాయణానికి సంబంధించిన అధ్యాయాలు, ఆలయాల గురించిన వివరాలు ఉంటాయి. పుస్తకం ముఖచిత్రం రాముడి దృష్టాంతాన్ని, రామ మందిరం చిత్రం, ప్రతిష్టాపన వేడుక తేదీని పేర్కొనబడింది. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యే అతిథులందరికీ ‘అయోధ్య దర్శనం’ పుస్తకాన్ని అందజేయనుండగా, ఎంపిక చేసిన కొంతమంది ప్రముఖ అతిథులకు మూడు అదనంగా పుస్తకాలను ఇవ్వనున్నారు.

Read Also: Bigg Boss Telugu : ఇకపై అవి రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు..?

సుమారు 100 మంది అతిథులకు ‘అయోధ్య మహాత్మ్యం’ (అయోధ్య మహిమ), ‘గీత దైనందిని’ (గీతా డైరీ), శ్రీరాముడిపై కథనాన్ని కలిగి ఉన్న ‘కల్యాణ్ పాత్ర’ మ్యాగజైన్ ప్రత్యేక సంచికను బహుమతిగా అందజేయనున్నారు. ‘కల్యాణ్’ పత్రిక ప్రత్యేక సంచిక 1972లో మొదటిసారిగా ప్రచురించబడింది. కాగా.. అయోధ్య వైభవానికి సంబంధించిన పలు కథనాలతో కూడిన ‘అయోధ్య మహాత్మ్య’ పుస్తకాన్ని గీతా ప్రెస్ అందిస్తుంది. ఆర్ట్ పేపర్‌పై 45 పేజీల ప్రింటెడ్ ఇలస్ట్రేషన్‌లతో ఈ పుస్తకం పాఠకులకు విజువల్ ట్రీట్ అవుతుంది.

ఇంకా.. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే, గీతా ప్రెస్ ఇంగ్లీషు, హిందీ తేదీలతో పాటు భగవద్గీతలోని శ్లోకాలతో కూడిన ‘గీత దైనందిని’ డైరీని అందజేయనుంది. డైరీలో ఉపవాసం, పండుగలు, సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల గురించిన వివరాలు ఉంటాయి. ఇది ఏడాది పొడవునా సమాచారాన్ని కోరుకునే వ్యక్తులకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది.

Exit mobile version