Site icon NTV Telugu

Ram Lalla Silver Coin: రామ్‌లల్లా వెండి నాణెం విడుదల.. ధర ఎంతో తెలుసా..?

Ayodhya

Ayodhya

అయోధ్యలో కొత్త రామాలయం ప్రారంభమైన తర్వాత రామ్‌లల్లాను దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇక, ఇక్కడి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అయోధ్యకు వచ్చి రామ్‌లల్లా దర్శనం చేసుకోలేని వారు ఆన్‌లైన్‌లో ప్రసాదాన్ని ఆర్డర్ చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం 50 గ్రాముల అయోధ్య రామాలయ వెండి నాణేలను ప్రజలకు విక్రయించేందుకు రిలీజ్ చేశారు.

Read Also: Fire Accident: నంద్యాల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం

కాగా, 50 గ్రాముల బరువున్న ఈ నాణెం ధర 5,860 రూపాయలు మాత్రమే.. ఇది 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ నాణెంలో ఒక వైపు రామ్ లల్లా విగ్రహం, మరొక వైపు రామాలయ ఫోటో కనిపిస్తుంది. ఆలయంలోని రామ్‌లల్లా విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగి రాజ్ రూపొందించగా.. ఈ నాణెం కొనుగోలు చేసిన వారు.. ఇంటిలోని పూజా మందిరంలో ఉంచవచ్చు.. లేదా ఎవరికైనా గిప్ట్ గా ఇవ్వొచ్చని రామ మందిర ట్రస్ట్‌ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

Exit mobile version