Site icon NTV Telugu

Rajnath Singh: రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించింది సిక్కులే.. వారి సహకారాన్ని మరిచిపోలేం..

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని గురుద్వారా అలంబాగ్‌లో శనివారం జరిగిన గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ ఉత్సవ్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కు సమాజాన్ని ఉద్దేశిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమోధ్యలో రామమందిరం కోసం దేశంలోని సిక్కు సమాజం ఉద్యమాన్ని ప్రారంభించిందని ఆయన అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

Read Also: Israel PM: సొంత సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. చిక్కుల్లో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ

రామజన్మభూమి ఉద్యమాన్ని సిక్కులు ప్రారంభించారని, వారి సహకారాన్ని ఏ భారతీయుడు ఎప్పుడూ మరిచిపోలేరని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం చాలా కృషి చేసిందని ఆయన ప్రశంసించారు. ‘‘ప్రభుత్వ రికార్డుల ప్రకారం నేను ఓ వాస్తవాన్ని మీతో పంచుకోవాలి.. డిసెంబర్ 1, 1858 ఎఫ్ఐఆర్ ప్రకారం, గురుగోవింద్ సింగ్ నినాదాలు చేస్తున్న సిక్కుల బృందం ఆ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకుంది. గోడలపై ప్రతీ చోట ‘రామ్ రామ్’ అని రాసింది’’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

సిక్కు గురువు గురునానక్ దేవ్ ని కొనియాడిన మంత్రి, భారతదేశాన్ని రక్షించడానికి నానక్ స్పూర్తిని ఇచ్చారని అన్నారు. భారతదేశాన్ని, భారతీయులను రక్షించడం మన కర్తవ్యం గురునానక్ దేవ్ కూడా మాకు ఈ స్పూర్తిని అందించారు అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. నిస్వార్థ సేవ, శాంతి మరియు సౌభ్రాతృత్వ సందేశాన్ని అందించే గురు గ్రంథ్ సాహిబ్, సిక్కు సమాజానికి మాత్రమే కాకుండా ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొన్నారు.

Exit mobile version