తెలుగు వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న వర్మ పోస్టులు పెడుతూ రచ్చ చేస్తుంటారు.. వర్మ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి.. కొన్ని పోస్టులు ఎంత దుమారం రేపుతాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వర్మ కాంపౌండ్ లో అందమైన అమ్మాయిలు ఉంటారు..వర్మ ఎంతో మంది హీరోయిన్స్ ను స్టార్స్ గా మార్చారు..ఊర్మిళ, నిషా కొఠారితో పాటు పలువురు వర్మ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన వద్ద నైనా గంగూలీ, అప్సర రాణి వంటి వారున్నారు. హీరోయిన్స్ గా వీరికి పెద్దగా ఫేమ్ లేదు. వర్మ తన చిత్రాలతో వాళ్ళను జనాలకు పరిచయం చేశాడు..
అప్సరా రాణి ఎప్పుడు వర్మ తో కనిపిస్తుంది.. ఆయన తెరకెక్కించిన అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో అప్సరా రాణి నటించారు. థ్రిల్లర్, డేంజరస్ చిత్రాల్లో ఆమె నటించారు. డేంజరస్ లెస్బియన్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. నైనా గంగూలీ, అప్సరా రాణి కలిసి నటించారు. అటు శృంగారం, ఇటు యాక్షన్ తో మెప్పించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన డి కంపెనీ మూవీలో కూడా అప్సరా రాణి నటించారు… ఆ సినిమాలో కూడా గ్లామర్ పరంగా మంచి మార్కులు పడ్డాయి.. కానీ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు..
ఇక వర్మతో కలిసి పార్టీలకు, పబ్ లకు వెళుతు చిల్ అవుతుంటారు.. ఇది ఇలా ఉండగా వర్మ తాజాగా ఆమె బికినీ ఫోటోలు షేర్ చేశాడు. వరుసగా పోస్ట్స్ తో బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ హీటు పుట్టించారు. వర్మ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ గా మారాయి. ఎలాంటి ఆఫర్స్ లేని అప్సరా రాణిని వర్మ తన పోస్ట్స్ తో ఫేమస్ చేస్తున్నారు.. అసలు వర్మ ప్రత్యేకంగా ఈ అమ్మడు ఫోటోలను ఎందుకు షేర్ చేస్తున్నారో అర్థం కాలేదు. కానీ అవి మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. ఇక ప్రస్తుతం వర్మ.. వ్యూహం టైటిల్ తో పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఇది వైఎస్ జగన్, నారా చంద్రబాబు నాయుడులను ఉద్దేశిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం. వ్యూహం చిత్రం నుండి కొన్ని స్టిల్స్ విడుదల చేశారు. అవి ఆసక్తిరేపాయి. అలాగే ఆర్జీవీ డెన్ పేరుతో కొత్త ఆఫీస్ ఓపెన్ చేశాడు. వర్మ ఆఫీస్ తన అభిరుచికి తగ్గట్లు అద్భుతంగా ఉంది… ఆ డెన్ ఫోటోలు కూడా ఓ రేంజులో వైరల్ అయ్యాయి..