Sarkar 4: రామ్ గోపాల్ వర్మ డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి ఐశ్వర్య రాయ్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarkar 4: శివ సినిమాతో మెగా ఫోన్ పట్టుకొని.. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగి అగ్ర దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన మార్క్ పొలిటికల్ క్రైమ్ డ్రామా ‘సర్కార్’. ఈ సినిమా సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలోనే ఈ ఫ్రాంచైజీ నుంచి నాలుగో భాగం రాబోతున్న నేపథ్యంలో, చిత్ర తారాగణంపై వస్తున్న వార్తలకు తాజాగా ఆర్జీవీ చెక్ పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటిస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు.
READ ALSO: Puri Jagannadh : పూరీకి ‘బిగిసిన ఉచ్చు’..సినిమాలు బ్యాన్?
Also Read
- Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
ఇటీవల ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “సర్కార్ 4లో ఐశ్వర్య రాయ్ నటించడం లేదు. కేవలం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు” అని స్పష్టం చేశారు. 2008లో వచ్చిన ‘సర్కార్ రాజ్’లో ఐశ్వర్య ‘అనితా రాజన్’ అనే కీలక పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే నాలుగో భాగంలో ఆమె పాత్ర ఉండదని వర్మ తేల్చి చెప్పారు. ఈసారి సినిమా ఎలా ఉండబోతోందనే ప్రశ్నకు వర్మ ఆసక్తికర సమాధానమిచ్చారు. “మునుపటి భాగాల కంటే ‘సర్కార్ 4’ ప్రపంచం చాలా పెద్దదిగా ఉంటుంది. కథలో లోతు ఎక్కువగా ఉండటమే కాకుండా, ప్రతి సన్నివేశాన్ని చాలా వివరంగా చూపిస్తాను. ముఖ్యంగా తెర వెనుక జరిగే రాజకీయ వ్యూహాలను భారీ స్థాయిలో ప్రెజెంట్ చేయబోతున్నాను. నా స్టైల్ క్లోజప్ షాట్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయి” అని వర్మ వివరించారు.
వచ్చే నెల నుంచే షూటింగ్..
రెడ్ లాఫ్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న వర్మ, ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచే ప్రారంభం కాబోతుందని వెల్లడించారు. 2005లో ‘సర్కార్’తో మొదలైన ఈ ప్రయాణం, 2008లో ‘సర్కార్ రాజ్’, 2017లో ‘సర్కార్ 3’తో కొనసాగింది. ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ‘సర్కార్ 4’ పట్టాలెక్కబోతోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి ‘సుభాష్ నాగ్రే’గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండటంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేని రామ్ గోపాల్ వర్మకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో అని ఆయన అభిమానులు ఉఠ్కంటతో ఎదురు చూస్తున్నారు.
READ ALSO: Trump: ట్రంప్ ప్రకటనతో మారిన చమురు లెక్కలు.. రూ.5,440 కోట్ల భారీ బెట్టింగ్ వెనుక అసలేం జరిగింది?
తాజావార్తలు
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Epic Movie Release Date: విజయ్ దేవరకొండ స్లాట్‌లో ఆనంద్ దేవరకొండ? ‘ఎపిక్’ విడుదలపై ఆసక్తికర ప్రచారం
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Jana Nayagan Box Office : తెలుగులో తగ్గిపోయిన ఓపెనింగ్స్.. రీమేక్ ఎఫెక్టేనా?
-
Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!