NTV Telugu Site icon

RamCharan RC 16 Movie: రామ్ చరణ్ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే..

Gautam Tinnanuri Ram Charan

Gautam Tinnanuri Ram Charan

RamCharan RC 16 Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. RC16గా ప్రచారంలో ఉన్న సినిమా ఆగిపోయిందన్న వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎట్టకేలకు చిత్రబృందం అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.. ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

Read Also: Balakrishna: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఫిక్స్ ?

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్తంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. RC15వర్కింగ్ టైటిల్ తో సినిమా చిత్రీకరణ వేగంగా జరుపుకుంటోంది. జెర్సీ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌చరణ్ తనతో నటించేందుకు రెడీ అయ్యాడు. ఆ సినిమాకి టైటిల్ పెట్టలేదు. కానీ RC16 పేరుతో కథా చర్చలు, నటుల ఎంపిక కూడా జరిగినట్లు సమాచారం. కానీ.. ఈ మూవీపై రామ్‌ చరణ్ అంత ఇంటస్ట్ర్‌గా లేడని రూమర్స్ వినిపించాయి. అలానే ఆగిపోయిందని కూడా వార్తలు వినిపించాయి. చివరికి అవే నిజమని తేలిపోయింది.

Read Also: Faria Abdullah: ఆయనకు అభ్యంతరం లేకపోతే నేను ఎప్పుడూ రెడీ

ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌ కాగా.. ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్, హీరోయిన్ అంజలి, కమెడీయన్ సునీల్ కూడా నటిస్తున్నారు.

Show comments