NTV Telugu Site icon

Ram Charan : భార్య, కూతురుతో చెన్నై కి రామ్ చరణ్.. న్యూ లుక్ అదిరిందిగా..

Ramm

Ramm

గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది.. ఇప్పుడు చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇటీవల వైజాగ్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. ఇప్పుడు చెన్నైలో షూటింగ్ జరగనుంది.. ఈ మేరకు రామ్ చరణ్ చెన్నైకి బయలు దేరాడు.. అదిరిపోయే లుక్ లో ఉన్న ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కుతుంది.. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది.. మే నెలలో షూటింగ్ ను పూర్తి చేసుకొని అక్టోబర్ లో సినిమా ను విడుదల చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.. ఇదిలా ఉండగా రామ్ చరణ్ కు చెన్నై యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.. చెన్నైకి చెందిన వేల్స్‌ యూనివర్సిటీ రామ్ చరణ్ కు సినిమాల్లో చేసిన సేవలకు గాను గౌరవ డాక్టరేట్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే..

నేడు ఈ యూనివర్సీటీలో జరుగుతున్న స్నాతకోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ కి డాక్టరేట్ ఇవ్వనున్నారు.. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.. తాజాగా రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసన, కూతురు క్లింకార తో కలిసి చెన్నై విమానాశ్రయంలో దిగారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వేల్ యూనివర్సిటీలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ డాక్టరేట్ అందుకోనున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఆ తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ లతో రెండు సినిమాలని కూడా ప్రకటించాడు.

Show comments