Peddi OTT : ఇట్స్ అఫిషియల్.. ఆరోజు నుంచే ఓటీటీలోకి పెద్ది

Peddi Team

Peddi Team

నెటిజన్లకు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులకు సరికొత్త ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా సినిమా ‘పెద్ది’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు డేట్ లాక్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అధికారిక ప్రకటన ప్రకారం… ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో జూలై 09 నుండి స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో విడుదలైన కేవలం 35 రోజుల్లోనే (అంటే దాదాపు 5 వారాల థియేట్రికల్ విండో పూర్తి చేసుకుని) ఈ సినిమా డిజిటల్ స్క్రీన్స్ పైకి రావడం విశేషం. జూలై 09 నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారులకు అందుబాటులోకి రానుంది. సౌత్ ఇండియన్ ప్రేక్షకుల కోసం ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించి మెప్పించారు. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్లీ మళ్లీ చూడాలనుకునే ఆడియన్స్‌కు జూలై 09 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అంటోంది సినిమా యూనిట్.