మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఉప్పెన’ సెన్సేషన్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్‌లో వేగంగా జరుగుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం,
Also Read : Sobhita Dhulipalla: లెక్కలు వేసుకుంటే ఇక్కడ రాణించలేం..
అక్కడ ఒక భారీ సెట్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే ఒక అదిరిపోయే ‘మాస్ సాంగ్’ చిత్రీకరిస్తున్నారు. ఈ పాట షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఏకంగా 500 మంది ప్రొఫెషనల్ డాన్సర్లను రంగంలోకి దించింది. రామ్ చరణ్ గ్రేస్, ఆ 500 మంది ఎనర్జీ తోడైతే స్క్రీన్ మీద విజువల్స్ పీక్స్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఇక ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు అదిరిపోయే మాస్ బీట్స్ ఇచ్చారట. ఈ భారీ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా చాలా కొత్తగా, మునుపెన్నడూ చూడని రీతిలో స్టెప్పులు ప్లాన్ చేసినట్లు సమాచారం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన సిగ్నేచర్ స్టైల్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
