Site icon NTV Telugu

Ram Charan : వారసత్వం ఉన్నా గుర్తింపు రావడానికి టైం పట్టింది – రామ్ చరణ్

Ramcharan

Ramcharan

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మీద రూమర్స్ రావడం, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడుకోవడం కొత్తేం కాదు. రీసెంట్‌గా రామ్ చరణ్ ఒక షోలో తన కెరీర్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. చిరంజీవి కొడుకుగా పుట్టడం తనకు పెద్ద ‘అడ్వాంటేజ్’ అని చరణ్ చెప్పారు. ఒక యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లి నేర్చుకునే దానికంటే, ఇంట్లోనే తన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్‌పీరియన్స్ చూసి చాలా విషయాలు త్వరగా నేర్చుకున్నానని అన్నారు. అయితే మెగా ఫ్యామిలీ లెగసీ తనకు ఎప్పుడూ భారం అనిపించలేదని, కాకపోతే ప్రేక్షకులు తనను ఒక నటుడిగా ఒప్పుకోవడానికే కొంచెం టైమ్ పట్టిందేమో అని చరణ్ నవ్వుతూ చెప్పారు.

Also Read : Mrunal-Dhanush : ఫిబ్రవరి 14న ధనుష్‌తో పెళ్లి? రూమర్లకు చెక్ పెట్టి మృణాల్ ఠాకూర్ టీమ్ ..

ఇక హిట్లు, ఫ్లాపుల గురించి మాట్లాడుతూ.. తను సక్సెస్‌ను అస్సలు నెత్తికి ఎక్కించుకోనని చరణ్ క్లారిటీ ఇచ్చారు. పొద్దున్న 8 నుండి సాయంత్రం 6 వరకు తన పని తాను చేసుకుని వెళ్ళిపోతానని, ఆ తర్వాత ఒక యాక్టర్ అనే విషయాన్నే మర్చిపోతానని అన్నారు. కానీ, ‘గేమ్ ఛేంజర్’ లాంటి ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు మాత్రం బాధగా ఉంటుందని, అవి మనల్ని కొంచెం వెనక్కి లాగుతాయని నిజాయితీగా చెప్పారు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమాలో తను ఒక క్రికెటర్‌గా నటిస్తున్నానని, తన కెరీర్‌లోనే ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అని చెప్పారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version