ప్రస్తుతం మన టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అప్పటివరకు ఉన్న తమ ట్యాగ్స్ ని అప్డేట్ చేసుకుంటున్నారు.అలా ‘పుష్ప’ కంటే ముందు స్టైలిష్ స్టార్ గా పిలువబడిన అల్లు అర్జున్.. తన ట్యాగ్ ను ‘ఐకాన్ స్టార్’ గా అప్డేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా అదే పని చేసాడు.’ఆర్ఆర్ఆర్’ మూవీ వరకు యంగ్ టైగర్ గా కొనసాగిన ఎన్టీఆర్..ఇప్పుడు ‘దేవర’ తో ‘మ్యాన్ ఆఫ్ మాస్ మాసెస్’ గా మారాడు. ఇప్పుడు మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. ’ఆర్ఆర్ఆర్’సినిమా వరకు మెగా పవర్ స్టార్ ట్యాగ్ తో కొనసాగిన రామ్ చరణ్ ఇప్పుడు తన ట్యాగ్ ని అప్డేట్ చేసుకున్నాడు.’ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ రామ్ చరణ్ ని అభిమానించడం మొదలుపెట్టారు. దాంతో ఫ్యాన్స్ కూడా చరణ్ ని ‘గ్లోబల్ స్టార్’ అని పిలవడం మొదలుపెట్టారు. దాంతో ఆ మధ్య ‘గ్లోబల్ స్టార్’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు ఇదే ట్యాగ్ ని రామ్ చరణ్ అఫీషియల్ గా తన సినిమాకి మార్చుకున్నాడు.
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు చరణ్ చేస్తున్న ‘RC16’ సినిమాతో చరణ్ ‘గ్లోబల్ స్టార్’ అనే ట్యాగ్ తో రాబోతున్నాడు. తాజాగా జరిగిన RC16 పూజ కార్యక్రమాలకు సంబంధించి ఓ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలోనే రామ్ చరణ్ పేరును ‘గ్లోబల్ స్టార్’ ట్యాగ్ తో ప్రజెంట్ చేశారు. ఇది తెలిసిన మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ కి మెగా పవర్ స్టార్ ట్యాగ్ కన్నా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ సరిగ్గా సూట్ అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.‘RC16′ మూవీ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా హాజరయ్యారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి హీరో మరియు హీరోయిన్స్ పై ఫస్ట్ క్లాప్ కొట్టారు. జాన్వి కపూర్ తన తండ్రి బోని కపూర్ తో కలిసి వచ్చింది. ‘గేమ్ ఛేంజర్’ డైరెక్టర్ శంకర్, సుకుమార్ మరియు ఏఆర్ రెహమాన్ లతో పాటూ దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతలు కూడా హాజరై మూవీ టీంకి బెస్ట్ విషెస్ తెలిపారు.
An auspicious beginning to #RC16 with the Pooja Ceremony ❤️🔥
Graced & blessed by MEGASTAR @KChiruTweets Garu, @shankarshanmugh Garu, #AlluAravind Garu and #DilRaju Garu ✨
Shoot begins soon!#RamCharanRevolts
Global Star @AlwaysRamCharan… pic.twitter.com/OstBQwv1yN— Vriddhi Cinemas (@vriddhicinemas) March 22, 2024