NTV Telugu Site icon

Ram Charan Birthday: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్‌ చరణ్‌ దంపతులు!

Ram Charan Upasana

Ram Charan Upasana

Ram Charan Visits Tirumala on His Birthday: నేడు ‘గ్లోబల్‌ స్టార్‌’ రామ్‌ చరణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రామ్‌ చరణ్‌ దంపతులు శ్రీవారిని దర్శించున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

పుట్టిన రోజుని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రమే కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రామ్‌ చరణ్‌ చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లారు. చరణ్‌ నేడు (మార్చి 27) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంకన్న సేవలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కూతురు క్లీంకార జన్మించిన తర్వాత మొదటిసారి రామ్‌చరణ్‌ శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.

Also Read: MS Dhoni Catch: 42 ఏళ్ల వ‌య‌స్సులో ఎంఎస్ ధోనీ క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో వైర‌ల్‌!

ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్‌ ద్విపాత్రాబినయం చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. గత రెండేళ్లుగా చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మొదటి పాటని నేడు విడుదల చేయబోతున్నారు. చరణ్ మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పారు.

Show comments