Ram Charan Birthday: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan Visits Tirumala on His Birthday: నేడు ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రామ్ చరణ్ దంపతులు శ్రీవారిని దర్శించున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
పుట్టిన రోజుని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రమే కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి రామ్ చరణ్ చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లారు. చరణ్ నేడు (మార్చి 27) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంకన్న సేవలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు క్లీంకార జన్మించిన తర్వాత మొదటిసారి రామ్‌చరణ్ శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.
Also Read
- Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
- Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
- Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
Also Read: MS Dhoni Catch: 42 ఏళ్ల వయస్సులో ఎంఎస్ ధోనీ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్!
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` చిత్రంలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాబినయం చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. గత రెండేళ్లుగా చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మొదటి పాటని నేడు విడుదల చేయబోతున్నారు. చరణ్ మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పారు.


తాజావార్తలు
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
-
Kiren Rijiju: ‘దేశాన్ని విభజించొద్దు’.. రేవంత్ వ్యాఖ్యలకు రిజిజు ఘాటు సమాధానం
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి