NTV Telugu Site icon

Ram Charan Birthday: అభిమానులకు క్యూట్ గిప్ట్.. మెగా ప్రిన్సెస్‌ను చూశారా?

Klin Kaara Photo

Klin Kaara Photo

Ram Charan and Upasana’s Daughter Klin Kaara Images: నేడు మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ పుట్టినరోజు. నేటితో చరణ్ 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుమల శ్రీవారిని చరణ్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చరణ్, ఉపాసన దంపతులు తమ కూతురు క్లింకార తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులుకు తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ న్యూస్ ఛానెల్ ‘ఎన్టీవీ’ క్యూట్ గిప్ట్ అందించింది.

Also Read: MS Dhoni Catch: 42 ఏళ్ల వ‌య‌స్సులో ఎంఎస్ ధోనీ క‌ళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో వైర‌ల్‌!

రామ్ చరణ్ పుట్టినరోజున మెగా ప్రిన్సెస్‌ ‘క్లింకారా’ విజువల్స్‌ను ఎన్టీవీ అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. శ్రీవారి ఆలయ మహద్వార ప్రవేశ సమయంలో తల్లి ఉపాసన ఒడిలో క్లింకారా ఉండగా.. కెమెరాకు చిక్కింది. క్లింకారా ఎంతో ముద్దుగా ఉంది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. క్లింకారాను చూసిన మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో క్లింకారా విజువల్స్ బయటికి రావడం శుభశుచికమని మెగా అభిమానులు అంటున్నారు.

Show comments