టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ అదిరిపోయే లుక్స్ లో నెట్టింట రచ్చ చేస్తోంది..కిల్లింగ్ పోజులతో రెచ్చగొడుతుంది.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా బాగా ఆకట్టుకుంటుంది.వరుసగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో ఫొటోషూట్లు చేస్తూ రెచ్చగొడుతుంది.. తాజాగా రకుల్ ట్రెడిషన్ వేర్ లో దర్శనమిచ్చింది. ట్రెడిషనల్ వేర్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతంచేసుకుంది.మరోవైపు తన గ్లామర్ తో మైమరిపిస్తుంది. టాప్ ను పక్కకు జరిపి మరీ గ్లామర్ షో చేసింది. కుర్రాళ్లను అస్సలు చూపు తిప్పుకోకుండా చేసింది. రకుల్ షేర్ చేసిన ఫొటోలను ఫ్యాన్స్ లైక్స్ మరియు కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.రకుల్ బాలీవుడ్ లో వరుస సినిమాలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.గత సంవత్సరం ఏకంగా నాలుగు చిత్రాలతో ఆమె అలరించింది. ఆ సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రస్తుతం అక్కడ రకుల్కు ఆఫర్లు అంతగా రావట్లేదని తెలుస్తుంది. దీంతో మళ్లీ సౌత్ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టింది.
కోలీవుడ్ లో ఇప్పటికే ఆమె రెండు చిత్రాల్లో నటిస్తోంది. కోలీవుడ్ బిగ్గెస్ట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’సినిమాలో నటిస్తుంది.అలాగే శంకర్ సినిమా తో పాటు శివ కార్తీకేయన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆయలాన్’సినిమా లో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. తెలుగులో మాత్రం రకుల్ చివరిగా ‘కొండపొలం’ సినిమా లో కనిపించింది.. ఆ తరువాత ఆమెకు ఆఫర్స్ అంతగా రాలేదు.తెలుగులో టాప్ స్టార్స్ తో నటించిన రకుల్ కు ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోస్ నుంచి ఆఫర్స్ రావడం లేదు.ఇప్పుడు ఈ అమ్మడి ఆశలన్ని కూడా శంకర్ సినిమా పైనే వున్నాయి. ఆ సినిమా కనుక భారీ విజయం సాధిస్తే ఆమె స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తాయని తెలుస్తుంది.