హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు తెలుగులో సరైన హిట్ సినిమాలు లేకపోవడంతో బాలివుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో ఎంతగా యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. తాజాగా ట్రెడిషినల్ లుక్ లో ఆకట్టుకుంది.. బ్లాక్ డ్రెస్సులో ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు.. నెట్టింట రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది.. అలాగే ఎప్పుడు హాట్ లుక్ లో కనిపించే ఈ అమ్మడు తాజాగా పద్దతిగా డ్రెస్సులో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది..
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు ఇద్దరు బాలీవుడ్ సినిమా లపైనే ఫోకస్ పెట్టారు.. డ్రగ్స్ కేసు వివాదం కూడా రకుల్ ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం రకుల్ తన సినిమాలపై ఫోకస్ పెడుతూ వస్తుంది.. ఇటీవల ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది..