టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం ఈనెల 21 న గోవాలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.. ఈ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. రకుల్ కు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు.. అలా రకుల్ ప్రీత్ పెళ్లి నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఈ పెళ్లికి మన టాలీవుడ్ సెలెబ్రిటీలు ఎక్కువగా వెళ్లలేదన్నట్టు తెలుస్తుంది..
టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కేవలం మంచు లక్ష్మీ మాత్రమే వెళ్లినట్లు తెలుస్తుంది.. హల్దీ ఫంక్షన్ లో దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది..తాజాగా రకుల్ ప్రీత్ తన పెళ్లికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీలు ఎంత సంతోషంగా ఉన్నారో కనిపిస్తోంది. ఇక ఓ సినిమాలో భారీ సాంగ్‌ను ఎలా అయితే షూట్ చేస్తారో అంతకు మించి ఉంది.. సినిమాను మించిపోయిందని చూస్తుంటే తెలుస్తుంది… ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ వీడియోలో రకుల్ ఎంట్రీ నుంచి ఉంది.. హల్దీ ఫంక్షన్ ఫోటోలు కూడా చూపించారు..రకుల్ ప్రీత్ జాకీ భగ్నానీ పెళ్లి గురించి చాలా రోజుల నుంచి రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు గానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అసలు పెళ్లి చేసుకుంటారా? అనే చర్చలు నెట్టింట్లో జరిగేవి. ఇప్పుడు రకుల్ పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ఇక ఈ అమ్మడు తెలుగులో ఈ మధ్య పెద్దగా సినిమాలు చేసినట్లు లేదు..