రకుల్ ప్రీత్ సింగ్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో కుర్రకారును ఉర్రూతలూరించింది.. స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. అక్కడ హిట్ సినిమాలు పలకరించలేదు..ఆ తర్వాత నిర్మాతతో ప్రేమలో పడింది.. రీసెంట్ గా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. సినిమాలకు గుడ్ బై చెప్తుందని వార్త వినిపిస్తుంది..
చాలా మంది సినీ తారలు ఒకవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు బిజినెస్ లు చేస్తున్నారు. సమంత, నయనతార, లాంటివారు ఈ విషయంలో ముందు ఉన్నారు. ఆ లిస్ట్ లోకి రకుల్ కూడా చేరింది.. పలు బిజినెస్ లు చేస్తూ బాగానే సంపాదిస్తుంది.. ఈమధ్య అవకాశాలు తగ్గడం.. టాలీవుడ్ కు కంప్లీట్ గా దూరం అయిపోయింది రకుల్.. బాలీవుడ్ లో అడపాదడపా ప్రాజెక్ట్ లు చేస్తూ వస్తోంది.. అలాగే ‘ఎఫ్ 45’ పేరుతో జిమ్స్ పార్లర్ ను నిర్వహిస్తున్నారు రకుల్. అలాగే, వెల్‌బీయింగ్ న్యూట్రిషన్ వంటి బ్రాండ్స్‌లోనూ షేర్లు ఉన్నాయి..
ఇప్పుడు పూర్తిగా సినిమాలను పక్కనపెట్టి వ్యాపారాలను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.. త్వరలోనే ఫుడ్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతుంది.. ఆరంభం పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించనున్నట్లు సమాచారం.. క్యూర్‌ఫుడ్స్తో కలిసి సంయుక్తంగా ఈ బిజినెస్ ను చేయబోతున్నారట.. న్యూట్రిషన్ ఫుడ్ ను అందించనున్నారు.. తృణదాన్యాలతో వీటిని తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది.. మరి సినిమాలను పూర్తిగా వదిలేస్తుందా? లేదా? అన్నది త్వరలోనే తెలియనుంది..