నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరియు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వివాహం ఈ నెల 26న ఉదయ్ పూర్ లో జరగబోతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబందించిన ఏర్పాట్లు కూడా చక చక జరుగుతున్నాయి. అయితే రష్మిక పెళ్ళిపై దీనిపై కన్నడ శెట్టి గ్యాంగ్ నుండి ఎవరైనా స్పందిస్తారా అని అంతా ఆసక్తిగా అనుకుంటున్న టైమ్ లో రక్షిత్ శెట్టి స్నేహితుడు ప్రమోద్ శెట్టి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
రష్మిక పెళ్లి గురించి ప్రమోద్ శెట్టి మాట్లాడుతూ “నాకు రష్మిక పెళ్లి శుభలేఖ అందలేదు. ఒకవేళ ఆమె పిలిస్తే నేను తప్పకుండా వెళ్తాను. కానీ, మాకు తెలుసు.. ఆమె మమ్మల్ని పిలవదు అని. ఇందులో కొత్తగా ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు” అని అన్నాడు. గతంలో రక్షిత్ శెట్టి మరియు రష్మిక మధ్య జరిగిన నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత వీరి మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయిన సంగతి తెలిసిందే.
రష్మిక తన జీవితంలో ముందుకు సాగిపోతుంటే రక్షిత్ శెట్టి పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నకు ప్రమోద్ చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. “రక్షిత్ గురించి ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన ఏమీ చాక్లెట్లు తింటూ, మూలలో కూర్చుని బాధపడే చిన్న పిల్లాడు కాదు. ఆయనకు తన జీవితంపై, కెరీర్‌పై స్పష్టమైన అవగాహన ఉంది. తన పనిలో తను బిజీగా ఉన్నాడు” రక్షిత్ శెట్టి ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని, పాత విషయాల గురించి ఆలోచించే సమయం ఆయనకు లేదని’ అన్నాడు. రష్మిక పెళ్లి వార్తలు ఒకవైపు హల్చల్ చేస్తుంటే, రక్షిత్ స్నేహితుల నుండి వచ్చిన ఈ రియాక్షన్ ఇప్పుడు కన్నడ మరియు టాలీవుడ్ వర్గలలో చర్చనీయాంశంగా మారింది.
