రానా దగ్గుపాటి.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లీడర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు రానా.ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు ను పొందాడు.మొదటి సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా వరుసగా సినిమాలను చేశారు.ఆయన నటించిన సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నప్పటికి కమర్షియల్ గా మాత్రం అంతగా సక్సెస్ కాలేదు. హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో బాహుబలి సినిమా లో విలన్ గా నటించారు. ఆ సినిమా తిరుగులేని విజయం సాధించింది. రానా యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. బాహుబలి సినిమాతో రానా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. బాహుబలి క్రేజ్ తో రానా వరుసగా మల్టీస్టారర్ మూవీస్ చేయడం మొదలు పెట్టారు.ఈయన సోలోగా చేసిన సినిమాలు ఏవి కూడా ప్రస్తుతం అంతగా సక్సెస్ ను అందుకోలేకపోతున్నాయి.
సోలోగా చేసిన గత చిత్రాలు అరణ్య మరియు విరాట పర్వం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన `భీమ్లా నాయక్` మాత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు రానా మరో మల్టీస్టారర్ కు సిద్ధం అవుతున్నట్లు సమాచారం..త్వరలోనే రానా మరియు డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన `నేనే రాజు నేనే మంత్రి` సినిమా భారీ విజయం సాధించింది.తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా మల్టీ స్టారర్ గా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో సీనియర్ స్టార్ రాజశేఖర్ తో రానా కలిసి నటించబోతున్నాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని సమాచారం.ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది.ఇటీవల డైరెక్టర్ తేజ స్వయంగా రానా దగ్గుబాటి తో `రాక్షస రాజు`అనే టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు గా ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకు వెళ్లబోతోందని సమాచారం