Site icon NTV Telugu

Governor Tamilisai : అన్నా చెళ్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనది

Tamilisai

Tamilisai

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకోని రాజ్‌భవన్‌లో రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్ భవన్ లో జరుగుతున్న రాఖీ ఫర్ సోల్జర్స్ ఎంతో ముఖ్యమైన కార్యక్రమమని, అన్నా చెల్లెళ్ళు మాత్రమే కాదు …ప్రజలంతా కూడా రక్షా బంధన్ జరుపుకుంటున్నామన్నారు. దేశంలో ఎన్నో సంస్కృతి లు…ఎన్నో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ…అంతా కలిసి మెలిసి ఉంటామని, అన్నా చెళ్లెల్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనదని ఆమె వ్యాఖ్యానించారు.

Also Read : Kuwait: షాపింగ్ మాల్ లో గొడవ.. ఎంత పెద్ద శిక్ష విధించారో తెలిస్తే షాక్ అవుతారు

సోల్జర్స్ వల్లే మనం ఇప్పుడు ఇంత హాయిగా ఉన్నామని, రాఖీ కట్టి వారికి మన కృతజ్ఞతలు తెలుపుకుందామని ఆమె పిలుపునిచ్చారు. దేశం ఈరోజున ఇలా ఉండటానికి కారణమైన సైనికుల గురించి యూత్ తెలుసుకోవాలని, మన దేశం అభివృధి చెందుతున్న దేశం కాదు అభివృధి చెందిన దేశమన్నారు గవర్నర్‌ తమిళిసై. చంద్రుని వరకు వెళ్ళిన మనం ఇప్పుడు సూర్యుని దగ్గరకి కూడా వెళ్ళబోతున్నామని, అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కు నేను ఒక తోబుట్టువునీ అని, రాజ్ భవన్ లో నేను ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ కడుతున్నానని ఆమె అన్నారు.

Also Read : Nabha Natesh: నభా.. నీ అందమే వేరు! కుర్రాళ్లకు కునుకు కష్టమే

Exit mobile version