Site icon NTV Telugu

Sailu Kampati: మరో రూరల్ డ్రామాతో వస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్.. ఈసారి ఏకంగా బిగ్ బ్యానర్‌లో ఛాన్స్!

Sailu Kampati

Sailu Kampati

Sailu Kampati: అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ వేణు ఊడుగుల ఈ సినిమాని నిర్మించడంతో ఈ మూవీపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఈ చిత్రం రిలీజ్ అయ్యి సక్సెస్‌ఫుల్ టాక్‌ను సొంతం చేసుకొని, ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. తన మొదటి ప్రయత్నంలో సాయిలు కంపాటి సక్సెస్ కొట్టి, ప్రేక్షకులలో మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో, ఇప్పుడు ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఆయన నెక్ట్స్ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

READ ALSO: T20 World Cup 2026: శ్రీలంక, జింబాబ్వే చేతిలో పరాజయం.. ఆస్ట్రేలియా పతనానికి అసలు కారణాలు ఇవే?

ఆసియన్ సునీల్ బ్యానర్‌లో సాయిలు కంపాటి నెక్ట్స్ సినిమా ఉండబోతుందని సమాచారం. ఇది కూడా ఒక రూరల్ డ్రామాగా తెరకెక్కబోతుందని టాక్. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ సర్కిల్‌లో ప్రచారం జరుగుతుంది. తన మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకులను తన కథతో కట్టిపడిసిన సాయిలు కంపాటి, నెక్ట్స్ సినిమా ఎలా ఉండబోతుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

READ ALSO: NTR – Prashanth Neel: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్‌ ఇదేనా!

Exit mobile version