Site icon NTV Telugu

Raju Weds Ramabhai Free Shows: మహిళలకు గుడ్ న్యూస్.. ‘రాజు వెడ్స్ రాంభాయ్’ ఫ్రీ షోలు.. థియేటర్ల లిస్ట్ ఇదే!

Raju Weds Ramabhai

Raju Weds Ramabhai

Raju Weds Ramabhai Free Shows: ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్‌లో ఎక్కడ చూసిన రాజు వెడ్స్ రాంభాయ్ సినిమా చర్చే జరుగుతుంది. చిన్న సినిమాగా విడుదలై ‘రూరల్ కల్ట్ బ్లాక్‌బస్టర్’గా దూసుకుపోతున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంభాయ్’. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం, ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు సాయిలు కంపటి దర్శకత్వం వహించగా, వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. దీనికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని మరింత మంది ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళలకు చేరువ చేసేందుకు ఈ సినిమా యూనిట్ ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

READ ALSO: Telangana : సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అమలు చేసి తీరుతుందా?

“మా రాంభాయ్ కథ.. ప్రతి మహిళ కోసం!!” అనే నినాదంతో, ఆంధ్రా, సీడెడ్ (Rayalaseema) ప్రాంతాల్లోని ఎంపిక చేసిన ప్రధాన థియేటర్లలో మహిళలకు ఉచిత స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్లు ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాను ఉచితంగా చూడాలనుకునే మహిళా ప్రేక్షకులు నేరుగా కింద ఇచ్చిన జాబితాలో ఉన్న థియేటర్ల దగ్గరకు వెళ్లి, అక్కడ ఉచితంగా టికెట్లు తీసుకొని సినిమాను ఆస్వాదించవచ్చని చెప్పారు.

ఉచిత ప్రదర్శనలు ఉన్న థియేటర్ల జాబితా (ఆంధ్రా & సీడెడ్):

విశాఖపట్నం: శ్రీ కన్య, జగదాంబ

విజయనగరం: కృష్ణ

శ్రీకాకుళం: సూర్య మహల్

రాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్

కాకినాడ: పద్మ ప్రియ కాంప్లెక్స్

ఏలూరు: అంబికా కాంప్లెక్స్

తణుకు: శ్రీ వెంకటేశ్వర

విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్

మచిలీపట్నం: సిరి కృష్ణ

గుంటూరు: బాలీవుడ్

ఒంగోలు: గోపి

నెల్లూరు: సిరి మల్టీప్లెక్స్

కావలి: లత (2 షోలు), మానస (2 షోలు)

చిత్తూరు: గురునాథ్

తిరుపతి: జయ శ్యామ్

నంద్యాల: నిధి

కర్నూలు: ఆనంద్

కడప: రవి

రాయచోటి: సాయి

అనంతపురం: SV సినీ మాక్స్

హిందూపురం: గురునాథ్

 READ ALSO: RSV virus Symptoms: జలుబు తీవ్రత పెరిగితే ఈ ప్రమాదం వస్తుంది..

Exit mobile version