Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ యువత సివిల్ సర్వీసెస్‌లో అత్యధిక సంఖ్యలో విజయం సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ సంయుక్తంగా అమలు చేస్తున్న ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం మరోసారి సత్ఫలితాలను అందించింది. ఇటీవల విడుదలైన సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో 31 మంది తెలంగాణ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి తుది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు.
సింగరేణి సంస్థ గత రెండేళ్లుగా తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి ఈ పథకానికి ఆర్థిక సహకారం అందిస్తోంది. ఈ పథకం ద్వారా మొదటి ఏడాది 7 మంది, రెండో ఏడాది 20 మంది చొప్పున ఇప్పటివరకు మొత్తం 27 మంది సివిల్స్‌లో విజయం సాధించారు. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన 158 మంది తెలంగాణ అభ్యర్థులకు రెండు నెలల క్రితం ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.1.58 కోట్లను సింగరేణి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆ సాయంతో మెయిన్స్‌కు సిద్ధమైన వారిలో 31 మంది తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, వీరికి ఇంటర్వ్యూ సన్నద్ధత కోసం సింగరేణి మరోసారి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించనుంది. అంతేకాకుండా, సింగరేణి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వీరికి మాక్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుందని సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి తెలిపారు.
Also Read
తుది ఇంటర్వ్యూకు ఎంపికైన 31 మందిలో వరంగల్ జిల్లా నుంచి అత్యధికంగా ఆరుగురు ఉండగా, మేడ్చల్–మల్కాజిగిరి నుంచి నలుగురు, హైదరాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున.. నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. అలాగే ఆదిలాబాద్, నారాయణపేట, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున అర్హత సాధించారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే 18 మంది ఓబీసీ, 8 మంది జనరల్ కేటగిరీ, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు.
తుది ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ఇంటర్వ్యూలోనూ విజయం సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ యువతను అఖిల భారత సర్వీసుల వైపు ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని సింగరేణి స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
-
Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
-
Nvidia: ఎన్విడియా సీఈఓ జాన్సన్ హువాంగ్ రాజీనామా..
-
Asaduddin Owaisi: “అబ్దుల్ ఇక చాప పరవడు”.. అఖిలేశ్‌కు ఒవైసీ సవాల్..
-
Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!