Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!
కోలీవుడ్‌లో ఎప్పుడూ లేనంత భారీ క్రేజీ మల్టీస్టారర్ సెట్ కాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి ‘డాన్’ ఫేమ్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిలిమ్స్’ పై ఈ సినిమాను నిర్మిస్తుండటం ఒక విశేషమైతే, ఈ మూవీలో విలన్ ఎవరనే వార్త ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తోంది.
రజనీకాంత్ కెరీర్‌లో ‘శివాజీ’, ‘రోబో’, ‘2.0’ వంటి అద్భుతమైన చిత్రాలు సృష్టించిన డైరెక్టర్ శంకర్, ఇప్పుడు రజనీకి విలన్‌గా మారబోతున్నారట. శిబి చక్రవర్తి డిజైన్ చేసిన ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం శంకర్‌ను సంప్రదించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దర్శకుడిగా మెగా ప్రాజెక్టులు తీసే శంకర్, నటుడిగా రజనీ లాంటి దిగ్గజం ముందు నిలబడితే ఆ సన్నివేశాలు వెండితెరపై మైండ్ బ్లోయింగ్‌గా ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా
Also Read
కేవలం నిర్మాతగానే కాకుండా, ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక కీలకమైన క్యామియో పాత్రలో మెరవబోతున్నట్లు సమాచారం. ‘విక్రమ్’ సినిమా తర్వాత కమల్ మార్కెట్ అమాంతం పెరిగింది, ఇప్పుడు రజనీ సినిమాలో ఆయన కనిపిస్తే అది ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద స్క్రీన్ షేరింగ్ అవుతుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ క్రేజీ ప్రాజెక్టుకు మరింత బలాన్ని చేకూర్చనుంది. ఈ వార్తపై అధికారిక ప్రకటన వస్తే మాత్రం సౌత్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్ లెవల్లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.
తాజావార్తలు
-
Thalaivar 173: తలైవర్ 173 నుంచి షాకింగ్ న్యూస్.. శంకర్ వర్సెస్ రజనీకాంత్!
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!