Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్, ఇప్పుడు కోలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సుహాస్, నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మండాడి’ చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ‘మండాడి’ చిత్రం మత్స్యకారుల జీవితాలు మరియు తీరప్రాంత నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే సెయిల్‌బోట్ రేస్ (పడవ పందాలు) సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రియలిస్టిక్ లుక్ కోసం మేకర్స్ వాస్తవ ప్రదేశాలలో, ఎంతో వ్యయప్రయాసల కోర్చి చిత్రీకరణ జరిపారు.
ఈ సినిమాతో సుహాస్ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుహాస్ ఏకంగా 100 రోజుల కాల్ షీట్స్ కేటాయించడం విశేషం. కథపై ఉన్న నమ్మకంతోనే ఆయన ఇంత సమయాన్ని కేటాయించారని తెలుస్తోంది. పాత్ర డిమాండ్ మేరకు సూరి, సుహాస్ ఇద్దరూ తమ లుక్స్‌ను, శరీరాకృతిని మార్చుకుని సహజత్వానికి దగ్గరగా కనిపించబోతున్నారు. షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో చిత్ర బృందం ప్రస్తుతం ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ మరియు సౌండ్ డిజైన్ పనుల్లో నిమగ్నమై ఉంది. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మరియు ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలోనే విడుదల తేదీపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!