Rajinikanth: రజనీ చిత్ర నిర్మాతకు హైకోర్టు షాక్.. రూ.2.5 కోట్లు కట్టాల్సిందే, లేదంటే జైలుకే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో పదేళ్ల క్రితం వచ్చిన ‘కొచ్చడైయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా అంతా చూసే ఉంటారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత మురళీ మనోహర్‌కు మద్రాసు హైకోర్టు గట్టి షాకిచ్చింది. పాత బకాయిలకు సంబంధించి ‘యాడ్ బ్యూరో’ సంస్థకు నాలుగు వారాల్లోగా రూ.2.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ ఇచ్చిన గడువులోపు ఈ నగదు చెల్లించకపోతే, ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. గతంలోనే ట్రయల్ కోర్టు ఆయనకు శిక్ష విధించగా, దానిని సవాలు చేస్తూ నిర్మాత హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా ఆయనకు ఊరట లభించకపోగా, డబ్బు కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది.
Also Read : Aamir Khan: అర్జిత్ ఇంటికి.. ఆమిర్ ఖాన్ వెళ్లడానికి అసలు కారణం ఇదే..
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
అసలు వివాదం ఏంటంటే?.. ఈ వివాదం 2014లో మొదలైంది. ‘కొచ్చడైయాన్’ సినిమా పనుల కోసం బెంగళూరుకు చెందిన యాడ్ బ్యూరో సంస్థ నుంచి మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధిగా మురళీ మనోహర్ రుణం తీసుకున్నారు. కానీ తిరిగి చెల్లింపులో భాగంగా ఆయన ఇచ్చిన రూ.5 కోట్ల చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. పదేళ్లుగా సాగుతున్న ఈ కేసులో తాజాగా హైకోర్టు తుది ఆదేశాలు జారీ చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో, 3డీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమా ఆర్థిక వివాదాల కారణంగా వార్తల్లో నిలిచింది.
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
-
Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
-
Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!