Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ వయస్సు.. 72. అయినా కుర్ర హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. ఈ మధ్యనే జైలర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన రజినీ.. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసి ఔరా అనిపించాడు. అయితే ఈసారి రజినీ హీరోగా కాకుండా కీలక పాత్రలోనటించడం విశేషం. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్ సలాం’. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో నటి జీవితా రాజశేఖర్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తుందని టాక్. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి తన తండ్రిని.. ఐశ్వర్య ఎలా చూపించబోతుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక నేటితో ఆ ఎదురుచూపులకు సమాధానం దొరికినట్లే.
Prabhas: స్టైల్ మారింది.. మా డార్లింగ్ లుక్ మారింది
తాజాగా ఈ చిత్రం నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. లాల్ సలాం సినిమాలో రజినీ మొయిద్దీన్ భాయ్‌గా కనిపించబోతున్నాడు. పేరుకు తగ్గట్టే ముస్లిం గెటప్ లో రజినీ అదరగొట్టేశాడు. భాయ్ కు ఉండాల్సిన రాజసం, ఠీవి.. రజినీ లుక్ లో కనిపిస్తున్నాయి. మొయిద్దీన్ భాయ్ వస్తున్నాడు అంటూ పోస్టర్ లో చెప్పుకొచ్చారు. సినిమాకు రజినీ పాత్రనే హైలైట్ అన్న విషయం తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. మరి మొదటిసారి కూతురు దర్శకత్వంలో నటిస్తున్న రజినీకి ఈ సినిమా ఎలాంటి మెమొరీస్ ను మిగులుస్తుందో చూడాలి.