Site icon NTV Telugu

Puneet Rajkumar: ‘అప్పు’కు కర్ణాటక రత్న అవార్డు… ఒకే వేదికపైకి రజనీకాంత్, ఎన్టీఆర్

Puneet

Puneet

Puneet Rajkumar: ‘అప్పు’ సినిమాతో అభిమానుల ఆరాధ్యదైవమైన పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో చనిపోయారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నడ రాజ్యోత్సవం నవంబర్ 1న పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ఇవ్వడానికి భారీ ఏర్పాట్లు చేశారు. కర్ణాటక రత్న అవార్డు పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు అందిస్తున్న సందర్భంగా చీఫ్ గెస్ట్ లుగా సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ టైగర్ ఎన్డీఆర్ ను కర్ణాటక ప్రభుత్వం. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆహ్వానించారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పుకు రజనీకాంత్ కు, పునీత్ రాజ్ కుమార్ తో యంగ్ టైగర్ ఎన్డీఆర్ కు ప్రత్యేక అనుబంధం ఉంది.

Read Also: Producer Shocking Gift to Wife: భార్యకు ఖరీదైన గిఫ్టు ఇచ్చిన ప్రొడ్యూసర్.. ఏం ఇచ్చాడో తెలిస్తే షాకే

పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సూపర్ స్టార్ దివంగత రాజ్‌కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్. బాలనటుడి గా అనేక సినిమాల్లో నటించారు. అప్పు సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు అయ్యారు. పునీత్ నటించిన పలు సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని తాయారు చేశారు. ఈ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు.

Exit mobile version