NTV Telugu Site icon

Rajinikanth: రజినీకాంత్ జపం చేస్తున్న సోషల్ మీడియా

Rajinikanth

Rajinikanth

Rajinikanth: ఇండియాలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉంటారు కానీ ఆ స్టార్ హీరోలతో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్న ఏకైక హీరో రజినీకాంత్. బ్లాకు అండ్ వైట్ సినిమాల నుంచి ఇప్పటి మోషన్ గ్రాఫిక్స్ వరకూ ప్రతి టెక్నాలజీలో సినిమా చేసిన హీరో రజినీకాంత్ మాత్రమే. తన స్టైల్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన రజినీ పేరు వినగానే ఇప్పటికీ అభిమానులకి గుర్తొచ్చే సినిమా బాషా. ఒక మాఫియా డాన్ సినిమా ఎలా ఉంటుందో? మాఫియా డాన్ ఎలా ఉంటాడో చూపించిన సినిమా బాషా. సురేష్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రజినీ స్టైల్ అండ్ డైలాగ్స్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్క్రీన్ ప్లే పరంగా కూడా బాషా అప్పటికి చాలా అడ్వాన్స్ ఉంటుంది. ఇంకో పది ఇరవయ్యేళ్లు అయినా సూపర్ స్టార్ ఫాన్స్ బాషా సినిమాని, అందులో వచ్చే బాషా బాషా అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ని మరిచిపోలేరు. ఆ మూవీకి, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కో్‌ర్‌కి ఉన్న క్రేజ్ ఏంటో నిరూపిస్తూ తమిళనాడులో ఒక ఈవెంట్ జరిగింది.

Varisu: వాళ్ల రాకతో ‘వారిసు’ రేంజ్ పెరిగింది…

తమిళనాడులో ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవా, ఒక కాన్సెర్ట్ పెట్టారు. ఈ కాన్సెర్ట్‌కి రజినీకాంత్ చీఫ్ గెస్టుగా వచ్చారు. మ్యూజికల్ నైట్‌లో దేవా కంపోజ్ చేసిన ఎన్నో హిట్ సాంగ్స్ కొంతమంది సింగర్స్ స్టేజ్ పైన పాడి అక్కడికి వచ్చిన ఆడియన్స్‌ని మెప్పించారు. ఇంతలో రజినీకాంత్‌ని స్టేజ్ పైకి పిలుస్తూ, సింగర్స్ అండ్ దేవా బాషా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని హమ్ చేయడం మొదలుపెట్టారు. అంతే అప్పటివరకూ సందడిగా ఉన్న ఆడిటోరియుం ఒక్కసారిగా బాషా బాషా అంటూ రచ్చ చేసింది. అంతమంది అరుపుల మధ్య, తన ట్రేడ్ మార్క్ లాంటి ఆర్ ఆర్ మధ్య రజినీకాంత్ నడుచుకుంటూ స్టేజ్‌పైకి వెళ్లిన సీన్ సూపర్బ్ అంతే. సినిమాని తలపించేలా జరిగిన ఈ ఇన్సిడెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లైవ్‌లో రజినీ స్వాగ్‌ని మిస్ అయిన వాళ్లు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తుంటే, లైవ్‌లో చూసిన వాళ్లు బాషా మూమెంట్‌ని రీలివ్ చేస్తున్నారు.