Site icon NTV Telugu

Tamil Nadu: తమిళనాడు పీసీసీ చీఫ్, సీఎల్పీ నేతల మార్పు

Cofng

Cofng

సార్వత్రిక ఎన్నికల ముందు తమిళనాడు కాంగ్రెస్‌లో మార్పులు.. చేర్పులు చోటుచేసుకున్నాయి. తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా కెఎస్. అళగిరి స్థానంలో సెల్వపెరుంతగై నియమితులయ్యారు. అలాగే తమిళనాడు సీఎల్పీ నేతగా ఎస్.రాజేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. తమిళనాడు కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న అంతర్గత తగాదాలు కారణంగానే మార్పులు చోటుచేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అళగిరిపై కొన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నట్లు అధిష్టానం గుర్తించింది. ఈ నేపథ్యంలో అళగిరిని తప్పించి కొత్త అధ్యక్షుడిని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఒక ముఖ్యమైన పరిణామం కారణంగా KS అళగిరి స్థానంలో K. సెల్వపెరుంతగైని నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే తమిళనాడు సీఎల్‌పీ నాయకుడిగా ఎస్.రాజేష్ కుమార్‌ను నియమించారు.

తమిళనాడులో రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 23 మంది సభ్యుల ఎన్నికల కమిటీకి సారథ్యం వహించడానికి KS అళగిరిని నియమించింది. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ఈ కమిటీలో ప్రముఖ నాయకులు కె. సెల్వ పెరుంతగై, పి. చిదంబరం, కుమారి అనాథన్ మరియు ఇతరులు ఉన్నారు.

 

Exit mobile version