Rajendraprasad : అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రాజేంద్రప్రసాద్
- అవకాశాల కోసం నానాఇబ్బందులు పడ్డ రాజేంద్రప్రసాద్
- ఛాన్సులు రాక సూసైడ్ చేసుకోవాలనుకున్న నటకిరీటి
- మూడు నెలలు తిండిలేక ఇబ్బంది పడ్డ రాజేంద్రప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajendraprasad : సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరగుతుందో ఎవరూ ఊహించలేదు. కొందరు చిన్న సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. కొందరు వంద సినిమాలు చేసినా స్టార్ డమ్ దక్కకపోవచ్చు. ఏది ఏమైనా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన వారంతా ఎన్నో కష్టాలు..ఒడిదుడులకు ఎదురొన్నవారే. కష్టమైనా ఇష్టపడి పని చేశారు కాబట్టే నేడు వారు సక్సెస్ సాధించారు. తాజాగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తన నట ప్రస్థానం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మానాన్న స్కూల్ టీచర్. చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఇంజనీరింగ్ అయిన వెంటనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నా. అందుకు ఆయన ఒప్పుకోలేదు. అసహనాన్ని వ్యక్తం చేశారు. నీ ఇష్టానికి వెళ్తున్నావ్. అక్కడ సక్సెస్ కావొచ్చు.. లేదా ఫెయిల్యూర్ ఎదురు కావొచ్చు. అది నీకు సంబంధించిన విషయం. ఒకవేళ ఫెయిలైతే ఇంటికి మాత్రం రావొద్దు అన్నారు. ఆ మాట నాపై చాలా ప్రభావం చూపించింది. మద్రాస్ వచ్చి ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో చేరాను. అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ సినిమాల్లో మాత్రం అవకాశం రాలేదు. వేషాలు వచ్చే గ్లామర్ నాది కాదని తెలుసు. ఆ సమయంలో ఇంటికి తిరిగి వెళ్లాను. ఎందుకు వచ్చావ్? రావొద్దు అని మొఖం మీదనే మా నాన్న కోప్పడ్డారు.
Read Also : Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్‌పోర్టులను సస్పెండ్ చేసిన కేంద్రం
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
చాలా బాధగా అనిపించి వెంటనే రిటన్ వెళ్లి మద్రాస్ కు వచ్చేశాను. బాధతో చచ్చిపోదాం అనుకున్నాను. చివరిగా ఓ సారి నా ఆత్మీయులందరిని చూడాలనిపించి వాళ్లను కలిసి మాట్లాడాను. చివరిగా నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఇంటికి వెళ్లాను. అక్కడ మేల్కొలుపు సినిమాకు సంబంధించి ఏదో గొడవ అవుతుంది. ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చి నన్ను చూసి ఏం మాట్లాడకుండా నన్ను డబ్బింగ్ రూంకు తీసుకెళ్లారు. ఓ సీన్ కి నాతో అక్కడ డబ్బింగ్ చెప్పించారు. అది ఆయనకు నచ్చి సమయానికి భలే దొరికావ్ అన్నారు. రెండవ సీన్ కి డబ్బింగ్ చెప్పమనగానే నా పరిస్థితి చెప్పాను. సరిగ్గా భోజనం చేసి మూడు నెలలు అయింది. భోజనం పెడితే డబ్బింగ్ చెబుతానని అన్నారు. అవకాశాలు రాక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. దానికి ఆయన కోప్పడ్డారు. ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టి, నాకు ధైర్యం చెప్పారు. అలా నా డబ్బింగ్ ప్రయాణం మొదలైంది. అలా చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. వచ్చిన డబ్బులతో మద్రాస్ లో ఇల్లు కట్టుకున్నాను. అక్కడే డైరెక్టర్ వంశీ పరిచయం అయ్యారు. ఆయన సినిమాలతోనే నాకు హీరోగా గుర్తింపు వచ్చింది’ అన్నారు.
Read Also :Maharaja : చైనాలో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ తో “మహారాజ”.. ఎన్ని కోట్లు సాధించిందంటే ?
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!