NTV Telugu Site icon

Bhatti Vikramarka : బ్యాంకర్లు ఆర్థికసాయం చేస్తే.. సమాజానికి మరింత ఉపయోగం

Bhatti

Bhatti

Bhatti Vikramarka : జూన్ 2వ తేదీన ఐదు లక్షల యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్న లక్ష్యాన్ని సమయానికి సాధించేందుకు బ్యాంకర్ల సహకారం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) సమావేశంలో ఆయన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవడం ముఖ్యమని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఐదు లక్షల యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.6,250 కోట్లు సబ్సిడీతో ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు. యువతను ఉత్పత్తి రంగంలోకి తీసుకువచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేలా పథకం రూపొందించామని తెలిపారు.

Uber Titanic : బెంగళూరు రోడ్లపై టైటానిక్ నౌక.. ఉబర్ కొత్త ప్రయోగం..!

రాజీవ్ యువ వికాసం పథకం సజావుగా అమలవడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నోడల్ అధికారి నియమించి సమన్వయం చేయాలని, పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రత్యేకంగా ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలు అందిస్తోందని, ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి రూ.21 వేల కోట్లను బ్యాంకుల్లో జమ చేసి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే రైతు బీమా ప్రీమియం డబ్బులు ప్రభుత్వం కట్టుతుందని తెలిపారు.

అదివి బిడ్డల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ఇన్‌దిరా సౌర గిరి జల వికాస పథకం రూపకల్పన చేసి, రూ.12,600 కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల 70 వేల ఎకరాలలో సౌర విద్యుత్తును సాగులో ఉపయోగించాలని ప్రణాళిక చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్షల కోట్లు వడ్డీ రహిత రుణాలుగా ఇస్తూ మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమల కోసం ట్రైనింగ్ అందిస్తున్నామని తెలిపారు. మూసీ నదిని పునర్జీవం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య పారిశ్రామిక అభివృద్ధి కోసం వివిధ క్లస్టర్ల ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.

Viral: బైక్‌పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!