Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. మధ్యప్రదేశ్ తరఫున ఆడుతున్న రజత్ పాటిదార్, అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 13 సిక్సర్లతో 135 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 281.25 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన పాటిదార్, 41 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు 57 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పాటిదార్, అస్సాం బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మైదానం నలుమూలలా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. పాటిదార్ మెరుపు బ్యాటింగ్ కారణంగా మధ్యప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Also Read
- Giacomo Filibeck: కాంగ్రెస్‌కు మద్దతుగా ‘ఓట్ చోర్’ నినాదాలు.. ఇటలీ నేతను బ్లాక్‌లిస్ట్ చేసిన ఫిలిప్పీన్స్!
- AP Govt: ఏపీలో టెక్నాలజీ విప్లవం.. మూడు నూతన పాలసీలకు ఉత్తర్వులు జారీ..
- Kulgam Encounter: కుల్గాం దాడి సూత్రధారి లతీఫ్ భట్ హతం.. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
- Gully Cricket: చిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
ఈ సెంచరీతో రజత్ పాటిదార్ తన పాత రికార్డును తానే బద్దలు కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో మధ్యప్రదేశ్ తరఫున సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా రజత్ రికార్డు నెలకొల్పాడు. గతంలో 2021లో గోవాపై 96 పరుగులు, 2022లో రైల్వేస్‌పై 92 పరుగులు చేసి త్రుటిలో సెంచరీలను చేజార్చుకున్నాడు. ఇప్పుడు మూడంకెల స్కోరును దాటి ఆ లోటును భర్తీ చేసుకున్నాడు.
ఇటీవల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ వన్డే టోర్నమెంట్‌కు ఎంపికైనప్పటికీ, పాటిదార్ ఆ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. 50 ఓవర్ల క్రికెట్ ఆడేందుకు తన శరీరం పూర్తిగా సహకరించడం లేదని, అందుకే కేవలం టీ20 క్రికెట్‌పైనే దృష్టి పెడుతున్నానని అతను స్పష్టం చేశాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పాటిదార్, తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో టీ20 ఫార్మాట్లో తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో మరోసారి నిరూపించుకున్నాడు.
- Tags
- cricket
- rajat patidar
- RCB
- T20
తాజావార్తలు
-
Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
-
Veeradhi Veerulu: మాస్ మహారాజా – శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
-
Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
-
Giacomo Filibeck: కాంగ్రెస్‌కు మద్దతుగా ‘ఓట్ చోర్’ నినాదాలు.. ఇటలీ నేతను బ్లాక్‌లిస్ట్ చేసిన ఫిలిప్పీన్స్!
-
Box Office Crisis: శుక్రవారం వస్తున్నాయి.. ఆదివారమే వెళ్లిపోతున్నాయి! చిన్న సినిమాలకు అసలేమైంది?
ట్రెండింగ్
-
Gully Cricket: చిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!