NTV Telugu Site icon

Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్.. 9 ఏళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి

Dravide

Dravide

టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. పదవీకాలం ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్ ఎన్నికైన విషయం తెలుసు. అయితే.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్‌ ప్రధాన కోచ్‌గా సెలక్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ శుక్రవారం ప్రకటించింది. జూన్‌లో బార్బడోస్‌లో భారత్ టైటిల్ గెలిచిన తర్వాత విరామం తీసుకున్న ద్రవిడ్.. ఈ ఏడాది చివర్లో జరగనున్న వేలానికి ముందు ఆటగాళ్ల రిటైన్ వంటి ముఖ్యమైన అంశాలపై పని చేయనున్నాడు.

Read Also: Putin: పుతిన్‌కి ఇద్దరు రహస్య కుమారులు.. విలాసవంతమైన ఒంటరి జీవితం..

గత మూడేళ్లుగా రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న కుమార సంగక్కర ఈ పదవిలోనే కొనసాగనున్నారు. ద్రవిడ్ 2012, 2013లో రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంతేకాకుండా.. రెండేళ్ల పాటు మెంటార్‌గా పని చేశాడు. ఆ తర్వాత.. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.. అంతేకాకుండా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి నాయకత్వం వహించాడు. అతను 2021లో NCA నుండి తప్పుకుని రవిశాస్త్రి స్థానంలో భారత జట్టు ప్రధాన కోచ్ అయ్యాడు.

Read Also: Ujjain Rape Case: ఉజ్జయిని అత్యాచార ఘటన.. వీడియో తీసిన వ్యక్తులపై కఠిన చర్యలు..!

Show comments