Site icon NTV Telugu

Rajasthan: “ఖాకీల దౌర్జన్యం”.. పోలీసు దెబ్బకు స్పృహ కోల్పోయిన దుకాణదారుడు..(వీడియో)

Rajasthan

Rajasthan

పోలీసుల దౌర్జన్యం పెరుగుతోంది. తాజాగా ఓ పోలీసు అధికారి రోడ్డు మధ్యలో ఓ దుకాణదారుడిని చెంపదెబ్బ కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పోలీసుల క్రూరత్వానికి ఈ వీడియో ఓ ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు.

READ MORE: Venky Atluri: అందుకే లక్కీ భాస్కర్ ఆయనతో చేశా

ఆ వీడియో ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని కైతునిపోల్ ప్రాంతంలో తన దుకాణం ముందు పార్క్ చేసిన బైక్‌ను తీసివేయమని ఎస్‌హెచ్‌ఓ దుకాణదారుడిని కోరినట్లు చెబుతున్నారు. ఆ దుకాణదారుడు అది తన బైక్ కాదని, దానికి లాక్ వేసి ఉందని సమాధానమిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన ఎస్‌హెచ్‌ఓ పుష్పేంద్ర బన్సివాల్ సహనం కోల్పోయాడు. ఇతర పోలీసులతో కలిసి దుకాణదారుడిపై దారుణంగా దాడి చేశాడు. అనంతరం ఆ దుకాణ దారుడిని పోలీసు వాహనంలో ఎక్కించేందుకు యత్నించాడు. తాను ఎక్కనని.. తాను చేసిన తప్పేంటో చెప్పాలని అతడు వాగ్వాదానికి దిగడంతో పుష్పేంద్ర గట్టిగా అతడి చెంపపై కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కుప్పకూలాడు. పోలీసుల దౌర్జన్యాన్ని ప్రస్తావిస్తూ.. NCMIndia కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. “ఈ ఖాకీ గూండాల నుండి మనం ఇంకా ఏమి ఆశించగలం?” అని ప్రశ్నించింది. ఈ సంఘటన మే 29న జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ ఎన్జీఓ ప్రశ్నించింది.

READ MORE: Venky Atluri: దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం బాగా ఉపయోగపడింది!

Exit mobile version