NTV Telugu Site icon

KKR vs RR : కోల్‌కతాపై రాజస్తాన్‌ ఘన విజయం.. దుమ్మలేపిన జైస్వాల్‌

Jaiswarl Rajastan

Jaiswarl Rajastan

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్తాన్‌. దీంతో.. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఆటగాళ్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేశారు. కోల్‌క‌తా బ్యాట‌ర్లలో వెంక‌టేశ్ అయ్యర్‌ 42 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు కొట్టి 57 పరుగులు సాధించి అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. మిగిలిన వారిలో కెప్టెన్ నితీశ్ రాణా(22), రింకూసింగ్‌(16), రహ్మానుల్లా గుర్బాజ్(18) లు ప‌ర్వాలేనిపించ‌గా జేస‌న్ రాయ్‌(10), ర‌స్సెల్ (10) లు విఫ‌లం అయ్యారు. అయితే.. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో చాహ‌ల్ నాలుగు వికెట్లు తీయ‌గా, ట్రెంట్ బౌల్ట్ రెండు, కేఎం ఆసిఫ్, సందీప్ శ‌ర్మ ఒక్కొ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Also Read : KKR vs RR : జైస్వాల్ విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్‌ సెంచరీ

అయితే.. 150 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. బ‌ట్లర్(0) ర‌నౌట్ అయ్యాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్ ఆడ‌గా బంతి బ్యాట్‌కు త‌గ‌ల‌లేదు. ప్యాడ్‌కు తాక‌డంతో ప‌క్క‌కు వెళ్లింది. బ‌ట్ల‌ర్ సింగిల్ వ‌ద్ద‌ని చెప్ప‌లోపే జైస్వాల్ స్ట్రైకింగ్ ఎండ్‌కు దాదాపు వ‌చ్చేయ‌డంతో బ‌ట్ల‌ర్ అత‌డి కోసం త‌న వికెట్‌ను త్యాగం చేశాడు. దీంతో రాజ‌స్థాన్ 30 ప‌రుగుల(1.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. కోల్‌క‌తా నిర్ధేశించిన 150 ప‌రుగుల ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ 13.1 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోయి ఛేదించడం విశేషం. రాజ‌స్థాన్ బ్యాట‌ర్ల‌లో బ‌ట్ల‌ర్ డ‌కౌట్ కాగా మ‌రో ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్‌ 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స‌ర్లు (98 నాటౌట్) దుమ్ములేపాడు. అత‌డికి తోడు కెప్టెన్ సంజు శాంస‌న్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు 48 నాటౌట్‌తో దూకుడుగా ఆడ‌డంతో రాజ‌స్థాన్ అల‌వోక‌గా విజ‌య తీరాలకు చేరింది. ఈ విజ‌యంతో రాజ‌స్థాన్ త‌న ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను సజీవంగా ఉంచుకోగా కోల్‌క‌తా అవ‌కాశాలు సంక్లిష్ట‌మ‌య్యాయి.

Also Read : KKR vs RR : ముగిసిన కోల్‌కతా బ్యాటింగ్‌.. రాజస్తాన్‌ లక్ష్యం 150