సంక్రాంతి సీజన్ జనవరి9న రిలీజ్ అవుతున్న రాజాసాబ్తో మొదలవుతోంది. ఈ రేసులో 5 సినిమాలు పోటీపడుతుంటే 14లోపు సినిమాలన్నీ వచ్చేస్తాయి. వీటిలో 3స్ట్రైట్ మూవీస్ కాగా డబ్బింగ్ మూవీస్‌గా విజయ్ ‘జన నాయగన్’.. శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ రిలీజ్ అవుతున్నాయి. రాజాసాబ్తోపాటు చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’గారు నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ స్ట్రైట్ తెలుగు మూవీస్‌గా బరిలోకి దిగుతున్నాయి.
Also Read : Trisha : నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు.. రంగలోకి పోలీసులు
రాజాసాబ్ జనవరి 9న పాన్ ఇండియగా రిలీజ్ అవుతున్నా.. తమిళంలో మాత్రం 10న రిలీజ్ అవుతోంది. విజయ్ ‘జన నాయగన్’ జనవరి 9న థియేటర్స్‌లోకి రావడంతో.. రాజాసాబ్ పోటీ నుంచి తప్పుకుని ఒకరోజు లేటుగా వస్తున్నాడు. తెలుగులో హిట్టయిన ‘భగవంత్ కేసరి’ మూల కథతో జన నాయగన్‌ను రీమేక్ చేశారు. సంక్రాంతి బరిలో ఇన్ని సినిమాలున్నా రాజాసాబ్ మినహా మరో సినిమాట్రైలర్ కనీసం టీజర్ కూడా రాలేదు. రాజాసాబ్ మాత్రం రిలీజ్‌కు 100 రోజుల ముందే ట్రైలర్‌తో వచ్చి ఆకట్టుకున్నాడు. నెక్ట్స్ ఏ సినిమా నుంచి ఏ టీజర్ వచ్చినా రాజాసాబ్తో పోల్చి చూడడంతో మేకర్స్‌కు ఇదొక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. రాజాసాబ్ కంటే మన శంకరవరప్రసాద్‌గారు ప్రమోషన్లో స్ట్రాంగ్‌గా వున్నా ఇప్పటివరకు గ్లిమ్స్ తప్ప మరోటి రాలేదు. మరో తెలుగు సినిమా ‘అనగనగా ఒక రాజు’కు సంబంధించిన రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ వీడియోను రీసెంట్గా విడుదల చేశారు. రేసులో వున్నట్టు చెప్పాడేగానీ టీజర్‌ను మాత్రం బైటపెట్టలేదు. షూటింగ్ టైటిల్ ఎనౌన్స్మెంట్?. షూటింగ్ మొదలైందంటూ వీడియోలు రిలీజ్ చేశారేగానీ టీజర్ వస్తేగానీ కథ తెలీదు. కానీ అదెప్పుడు వచ్చేది మాత్రం చెప్పడం లేదు. రాజాసాబ్ మినహాయిస్తే సంక్రాంతి వీరులందరూ గ్లిమ్స్‌తో సరిపెట్టారు.’మన శంకరవరప్రసాద్‌గారు’ నుంచి రీసెంట్గా సాంగ్ రిలీజ్‌తో స్పీడ్ పెంచింది. అయితే టీజర్ రిలీజ్‌కు ఇంకా టైం వుందని తెలిసింది.