Site icon NTV Telugu

Rajamouli: నా రెండు సినిమాలు సూర్య మిస్ అయ్యాడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ !

Surya Rajamouli

Surya Rajamouli

పాన్ ఇండియా సినిమాలను శాసిస్తున్న దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి నెంబర్ వన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు బాలీవుడ్ దర్శకులు, హీరోలు తెలుగు సినిమాలను తక్కువగా చూసిన పరిస్థితుల నుంచి, తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్థాయినే మార్చేసిన రాజమౌళి, అప్పటి నుంచి ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన డైరెక్షన్‌లో నటించాలనే కోరిక దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి స్టార్ హీరోకు ఉందంటే అతిశయోక్తి కాదు. అలాంటిది..

Also Read : Jana-Nayagan : విజయ్ ‘జన నాయగన్’కు స్పెషల్ టచ్..

తాజా బజ్ ప్రకారం, తమిళ స్టార్ హీరో సూర్యతో రాజమౌళి రెండు సినిమాలు చేయాలనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టులు వర్కౌట్ కాలేదని సమాచారం. ఆ రెండు సినిమాలేంటంటే రవితేజ హీరోగా వచ్చిన ‘విక్రమార్కుడు’, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘మగధీర’. మొదట ఈ కథలను సూర్య‌తో చేయాలని రాజమౌళి అనుకున్నప్పటికీ, అప్పటి పరిస్థితులు, భాషా పరమైన అంశాల కారణంగా తెలుగు హీరోలతోనే ఈ సినిమాలు చేయడం సరైనదని నిర్ణయించుకున్నారట. ఆ తర్వాత ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్స్‌గా నిలవడం తెలిసిందే. ఒక వేల కనుక ఈ సినిమాలు సూర్యకు పడి ఉంటే, ఆయన కెరీర్ పూర్తిగా మరో స్థాయికి వెళ్లేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి నుంచి రాజమౌళి దర్శకత్వంలో చిన్న అవకాశం వచ్చినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నానని సూర్య పలుమార్లు చెప్పినట్లు టాక్. మరి భవిష్యత్తులో అయినా ఈ క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? లేదా అనేది చూడాల్సిందే.

Exit mobile version