Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!

  • రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం
  • గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్
  • ప్రేమ వైఫల్యం కారణంగానే
Rajahmundry Tragedy

Rajahmundry Tragedy

తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిపై నుంచి ఓ కానిస్టేబుల్ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏపీ స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ సెల్‌లో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్.. ప్రేమ వైఫల్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

బ్రిడ్జిపై తన బైక్‌ను వదిలి గోదావరిలోకి దూకినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రాజమండ్రి టూ టౌన్ సీఐ శివ గణేష్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన కానిస్టేబుల్ కోసం పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటన స్థలంలో లభించిన బైక్ ఆధారంగా కానిస్టేబుల్ వివరాలను సేకరిస్తూ.. ఘటనకు గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

×
×
Ad