MP Margani Bharat Ram: ఆవ భూముల్లో 150 కోట్లు దోచేశానని, అభివృద్ధి పనుల్లో 15 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుండి వైదొలగుతాను అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. రీల్ ఎంపీ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. పార్లమెంట్‌లో ఈ విషయాలు మాట్లాడటం లేదని చంద్రబాబు చేసిన ఆరోపణలపై సవాల్ చేస్తున్నా.. పార్లమెంట్‌లో నేను లేవనెత్తిన ఎక్కువ అంశాలు ఎవరు ప్రస్తావించలేదన్నారు. ఆవ భూముల్లో 150 కోట్లు దోచేశానని, అభివృద్ధి పనుల్లో పదిహేను శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుండి వైదొలగుతానని ప్రకటించారు. విమర్శలు చేసే ముందు చంద్రబాబు ఆలోచన చేయాలని సూచించారు.
Read Also: Kalki: పాన్ వరల్డ్ సినిమా నుంచి టీజర్… త్వరలో
రాజమండ్రిలో టంగుటూరి ప్రకాశం పంతులు పార్క్‌ను ఎన్టీఆర్ పార్క్ గా మార్చేశారు.. ఇంత దుర్మార్గం మరొకటి లేదని దుయ్యబట్టారు ఎంపీ భరత్ రామ్.. ఈ పార్క్‌కు తిరిగి ప్రకాశం పంతులు పార్క్‌గా మార్పు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను కోరతాం అన్నారు. ఇక, విభజించిన రాష్ట్రానికి అన్యాయం చేసింది చంద్రబాబు అని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టింది చంద్రబాబేన్న ఆయన.. పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతలు ఎవరితోనైనా చర్చకు సిద్ధం అన్నారు. మీరా నామీద విమర్శలు చేసేది అంటూ విరుచుకుపడ్డారు. సెంట్రల్ జైల్లో ఉండగా చంద్రబాబు కిటికీలోనుంచి రాజమండ్రి అభివృద్ధిని చూసి ఉంటారన్నారు. పుష్కరాల్లో రెండు వేల కోట్లు తినేసింది చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, బెజవాడలో సీఎం వైఎస్ జగన్ ‘సిద్ధం’ ప్లెక్సీకి పోటీగా పవన్ కల్యాణ్ మేం కూడా సిద్ధం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని హేళన చేశారు.. పవన్ సిద్ధమవుతుంది నాలుగో పెళ్లికా అంటూ ఎద్దేవా చేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.