తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీరామారావు శతజయంతి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ పై ఎంతో ప్రేమ చూపిస్తున్నారని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఎన్టీఆర్ పై చంద్రబాబు చూపిస్తుంది కపట ప్రేమ అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. ఎందరినో ప్రధానమంత్రులను, మరెందరికో భారత రత్న ఇతరత్రా ప్రతిష్టాత్మక పదవులు ఇప్పించానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇప్పించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి రజనీకాంత్ రావడం ఆయన ఆలోచించుకోవాలని అన్నారు.
Read Also: Farmers Suffering : అకాల వర్షాలతో అరిగోస పడుతున్న రైతన్నలు
గౌరవం,ఒక ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ దయచేసి చంద్రబాబును నమ్మొద్దని ఆయన అన్నారు. చంద్రబాబుకి కొడుకు మీద నమ్మకం లేక పేమెంట్లు ఇచ్చి అద్దె కొడుకుని తెచ్చుకున్నాడని ఆరోపించారు. మాట్లాడ్డం చేతకాని నారా లోకేష్ పప్పు ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ల పేరుతో కొత్త కొత్త డ్రామాలకు తెర తీసిందని ఆరోపించారు. గతంలో మట్టి తవ్వి తెలుగుదేశం నాయకుల జేబులు నింపుకుంటే ఇప్పుడు మట్టి తవ్వే డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళ్లుతుందని, ఇది ప్రజలు ఆలోచించాలని కోరారు. గతంలో తెలుగుదేశం జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను దోచుకుతున్నారని, దానిపై బీజేపీ ఛార్జీషీటు వేసి ఉంటే బాగుండేదని ఎంపీ మార్గాని భరత్ అభిప్రాయపడ్డారు. ఏపీలో రజనీకాంత్ పర్యటనపై ఇప్పటికే వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంపీ మార్గాని భరత్ కూడా విమర్శలు ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Sleeping: ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మంచం మార్చాల్సిందే..