Rainbow Childrens Hospital: అరుదైన శస్త్ర చికిత్స ద్వారా శిశువును కాపాడిన రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్
- విశాఖపట్నంలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో
- అరుదైన శస్త్ర చికిత్స ద్వారా శిశువును కాపాడిన వైద్యులు.
Rainbow Childrens Hospital: విశాఖపట్నంలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ నిపుణుల బృందం నగరంలోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సహకారంతో కేవలం 33 వారాల నెలలు నిండని కవల శిశువును కాపాడే శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. కేవలం 1.5 కిలోల బరువున్న శిశువుకు పుట్టుకతో వచ్చే గ్లాకోమా, తీవ్రమైన గుండె పరిస్థితిని గుర్తించారు. కేవలం 14 రోజుల వయస్సులో, శిశువుకు PDA (పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్) లిగేషన్ కార్డియాక్ సర్జరీ జరిగింది. ఈ సున్నితమైన ప్రక్రియ పుట్టిన తర్వాత నిర్వహించారు. డాక్టర్ చౌహాన్ అభినవ్‌సింగ్ ఎ, పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన, రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. విశాఖపట్నంలోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్. దివ్య దంగేటి, డాక్టర్. శివాని కొడాలి 24 గంటల్లో, శిశువుకు రెండు కళ్లకు గ్లాకోమా శస్త్రచికిత్స నిర్వహించి శాశ్వత అంధత్వాన్ని నివారించడంలో సహాయపడ్డారు.
Also Read: West Indies vs Bangladesh: సొంతగడ్డలో వెస్టిండీస్‌కు ఘోర అవమానం.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్
Also Read
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
తమ బిడ్డ క్లిష్ట పరిస్థుతలను నైపుణ్యంగా ఎదుర్కొని త్వరితంగా నిర్ణయాలు తీసుకుని బిడ్డలా జీవితాలను కాపాడినందుకు తల్లిదండ్రులు అమితానందం పొందారు. తమ పిల్లల జీవితాన్ని కాపాడినందుకు కార్డియాలజిస్ట్, NICU బృందానికి ధన్యవాదాలు తెలిపారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని NICU (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ టీమ్), డాక్టర్ మందుల ఫణి ప్రియ, కన్సల్టెంట్ DM నియోనాటాలజిస్ట్, డాక్టర్ సతీష్ వాడపల్లి, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్, డాక్టర్ బాల శ్రీలత పులి, కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్లు శిశువులను రక్షించాతంలో కీలక పాత్ర పోషించినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “ఇది అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలు మాత్రమే కాదని ఇది ఒక అద్భుతమైన విజయగాథ అని తెలిపారు. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మన నగరంలో ప్రపంచ స్థాయి సంరక్షణను అందిస్తున్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. మా నిపుణుల బృందం ఈ బిడ్డకు అత్యుత్తమ జీవన అవకాశం అందించుటకు సజావుగా కలిసి కట్టుగా పనిచేసిందని పేర్కొన్నారు. అతి తక్కువ వ్యవధిలో ఈ డబుల్ చికిత్సలను విశాఖపట్నంలో నిర్వహించటం నియోనాటల్ కేర్ నాణ్యతకు నిదర్శనం. ఇది అకాల, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాల వారికి ఆశాజ్యోతిగా మారుతుందన్నారు.
Also Read: Alzheimer: ఆ పనులు చేసేవారికి అల్జీమర్స్ బారినపడే అవకాశం తక్కువట!
25 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రముఖ చైన్ హాస్పిటల్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అధునాతన నియోనాటల్ కేర్, పీడియాట్రిక్ సేవలకు ప్రసిద్ధి చెందింది. ప్రసుత కేసు ఈ ప్రాంతంలో ప్రముఖ ఆరోగ్య సంరక్షణ ప్రదాతగా రెయిన్ బో హాస్పిటల్ పాత్రను మరింత హైలైట్ చేస్తుంది. అత్యాధునిక NICU, అంకితమైన పీడియాట్రిక్ కార్డియాక్ సంరక్షణా బృందం, నిపుణుల సహకార నెట్‌వర్క్‌తో తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి అసాధారణమైన ఆరోగ్య ఫలితాలను అందజేస్తూనే ఉంది రెయిన్ బో హాస్పిటల్.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!