NTV Telugu Site icon

PAK vs IRE: పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్కు పొంచి ఉన్న వర్షం ముప్పు.. పాక్ పరిస్థితేంటి..?

Pak Vs Ire

Pak Vs Ire

2024 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా.. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ టోర్నీలో కెనడాను ఓడించి పాకిస్తాన్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. కెనడాపై పాకిస్తాన్ గెలిచినప్పటికీ.. ఆ జట్టుకు సమస్యలు తీరలేదు. కాగా.. పాకిస్తాన్ జట్టు తదుపరి మ్యాచ్ జూన్ 16న ఐర్లాండ్‌తో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఫ్లోరిడాలో వాతావరణం పాక్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఆడిన 3 మ్యాచ్ల్లో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో గెలవడం ద్వారా, పాకిస్తాన్ జట్టు టోర్నమెంట్‌లో ఒక అడుగు ముందుకు వేసింది. పాక్.. తర్వాతి మ్యాచ్ ఐర్లాండ్‌తో ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో ఆడనుంది.

Heart Pain-Acidity: గుండెనొప్పి, ఎసిడిటీ వల్ల ఛాతిలో కలిగే బాధ మధ్య తేడా ఇదే..

ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ జట్టుకు సమస్యలు ఎక్కువయ్యాయి. నివేదికల ప్రకారం.. ఫ్లోరిడాలో వచ్చే వారం రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్‌ను వర్షం ప్రభావితం చేసే అవకాశం ఉంది. మరోవైపు.. జూన్ 12న శ్రీలంక, నేపాల్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో శ్రీలంక జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయమైపోయింది.

Music Shop Murthy: పుష్ప కంటే ముందే మ్యూజిక్ షాప్ మూర్తి.. అదే అసలు పాయింట్: దర్శకుడు ఇంటర్వ్యూ

వాతావరణ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్-ఐర్లాండ్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం 91 శాతం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వనున్నారు. ఈ విధంగా.. పాకిస్తాన్ జట్టుకు మొత్తం 3 పాయింట్లు ఉంటాయి. అయితే అమెరికా, ఇండియా ఇప్పటికే గ్రూప్ ‘A’ పాయింట్ల పట్టికలో మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. సూపర్‌-8 చేరుకోవాలన్న పాకిస్థాన్‌ జట్టు కల చెదిరిపోనుంది.