NTV Telugu Site icon

Mumbai Rains: ముంబైలో వర్ష బీభత్సం. కుప్పకూలిన ఓ భవనం.. నలుగురు సేఫ్.. మరో ఇద్దరి కోసం గాలింపు..!

Mumbai Rains

Mumbai Rains

Mumbai Rains: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం నుంచి మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓ భవనంలో కొంతభాగం కుప్పకూలింది. దీంతో చాలా వరకు ఆస్తినష్టం వాటిల్లింది. అంతేకాకుండా శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నారు. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే వారిని ప్రథమ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు తెలుపుతున్నారు. అందులో వృద్ధ దంపతులు కూడా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. దీంతో వెంటనే శిథిలాల కింద కాపాడేందుకు NDRF బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.

Read Also: GVL Narasimha Rao: బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.. జనసేనతో పొత్తు ఉంది

ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి మూడంతస్తుల భవనంలో చాలా భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎవరూ బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తమను తాము రక్షించుకునే క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్నట్లు NDRF తెలిపింది. సమాచారం అందుకున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. ఈ ప్రమాదంలో భవనంలో ఉన్న చాలా మంది శిథిలాల కింద సమాధి అయ్యారని చెప్పారు. వీరిలో నలుగురిని సురక్షితంగా బయటకు తీశారు.

Read Also: Somu Veerraju: మేము సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. వాళ్లు బాంబ్‌లు వేసుకుంటారు

శిథిలాల కింది మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే NDRF బృందాలు వారిని వెతకడానికి మరియు రక్షించడానికి ఆపరేషన్ను ముమ్మరం చేశాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం NDRF యొక్క 3 బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఉదయం 9.33 గంటలకు జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మొదటి స్ధలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన బృందం ఉన్నతాధికారులకు సమాచారం అందించింది. అనంతరం రాష్ట్ర బృందాలతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు శిథిలాలను సురక్షితంగా తొలగించి నలుగురిని బయటకు తీశారు. శిథిలాల కింద ఇంకా ముగ్గురు చిక్కుకున్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు శరవేగంగా శిథిలాలను తొలగిస్తున్నాయి.