Hyderabad Rains : హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. నార్సింగ్, బండ్లగూడ, కాటేదాన్, గండిపేటలో భారీ వాన కురిసింది. రాజేంద్రనగర్‌లో వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా రోడ్లపైకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నగరంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. వాతావరణ శాఖ నగరంలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తదితర హెచ్చరికలు జారీ చేసిన శాఖ.. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.
Also Read : Bridge collapse: గుజరాత్లో కూలిన వంతెన.. 10 మంది గల్లంతు..
Also Read
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
వాతావరణ శాఖ ప్రకారం, హైదరాబాద్‌లోని మొత్తం ఆరు జోన్లు – చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బి నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి – సెప్టెంబర్ 27 వరకు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. తన కచ్చితమైన అంచనాలకు ప్రసిద్ధి చెందిన వాతావరణ ప్రియుడు టి. బాలాజీ కూడా హైదరాబాద్‌లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షం పడుతుందని అంచనా వేశారు. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) డేటా ప్రకారం, నగరంలో నిన్న ఎటువంటి వర్షపాతం లేదు. ప్రస్తుత రుతుపవనాల సీజన్లో తెలంగాణలో సాధారణ వర్షపాతం 708.8 మిల్లీమీటర్లు దాటి 828.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 580.8 మి.మీ కంటే ఎక్కువగా 722.7 మి.మీ నమోదైంది.
Also Read : Ravi Kishan: డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్‌ని కోరిన రేసుగుర్రం విలన్..
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!