గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటలు అకాల వర్షాల కారణంగా నీటిపాలవుతున్నాయి. దీంతో రైతన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా.. ప్రధాన పట్టణాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే.. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఉరుము, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే.. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చిరకలు జారీ చేశారు.
Also Read :PM Modi: దేశంలో ప్రజాస్వామ్యం పటిష్ఠం.. ఓర్వలేకే దాడులు చేస్తున్నారు..
ఇదిలా ఉంటే.. ఉమ్మడి వసరంగల్ జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా గంట పాటు గులకరాళ్ల సైజులో వడగండ్లు పడి వరి పంటలు, తోటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులు వీచి పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. పొట్ట దశలో ఉన్న వరి పంటలు దెబ్బతిన్నాయని . ములుగు జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం, గణపురం మండల కేంద్రంలో వడగండ్ల వర్షం కురిసింది. దీంతో రహదారిపై రాళ్లు కుప్పలుక్పులుగా పడ్డాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నర్సింహులపేట మండలాల్లో పెంకుటిండ్లు, వరి పంటలు దెబ్బతిన్నాయి.
Also Read : Tamilnadu: ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి చీలిక దిశగా పయనిస్తోందా?
జనగామ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రాత్రి కురిసిన గాలి వానకి గ్రేటర్ వరంగల్ పలు రేకుల ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయి.. కరిమాబాద్. ఖిలా వరంగల్ లో ఇంటి పైన వేసిన రేకులు కొట్టుకొని పోవడం జనం ఇబ్బందులు పడ్డారు. నిజమాబాద్ లోనూ వడగండ్ల వర్షం తో పంట నష్టం వాటిల్లింది. బీర్కూర్, మేనూరు, నర్సాపూర్, రామా రెడ్డి, మోస్రా, జుక్కల్, నస్రుల్లా బాద్, ముగ్ధుపూర్ లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. 200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారుల నివేదిక అందింది. మాలాపల్లి లో పిడుగుపాటుకు ముగ్గురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారు.