తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈరోజు తెల్లవారుజాము వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ వాసులకు, రాష్ట్ర ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read : Sunny Leone : బికినీతో బీచ్ ఒడ్డున సన్నీలియోనీ.. మమ్మల్నీ పిలవొచ్చుగా అన్న నెటిజన్
అయితే.. వర్షపు చినుకులతో హైదరాబాద్ వాసులు ఎండల నుంచి ఉపశమనం పొందారు. మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గంలో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా పలు చోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురు గాలులు వీస్తున్నాయి. అయితే.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.