ఎల్లుండి మరో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతం దగ్గరలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణశాఖ.
ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక అటు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, లక్ష్మీ బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతో్ంది. దీంతో గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది.
Also Read
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Tags
- rains
- telangana
- weather update
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్‌కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!